ఆపదలో ఆదుకున్న స్నేహితులు

by Shyam |
ఆపదలో ఆదుకున్న స్నేహితులు
X

దిశ, షాద్‌నగర్: గతంలో వారంతా ఓకే తరగతి విద్యార్థులు. తదనంతరం ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో స్థిరపడ్డారు. ఈ మధ్యకాలంలో తమలోని ఒక మిత్రుడు బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయాడని తెలుసుకొని అతని కుటుంబానికి తమ వంతుగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వారంతా 2003 – 04 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు. వీరిలో వేములనర్వ గ్రామానికి చెందిన కందికంటి మల్లేష్ అనారోగ్యంతో ఈ నెల 14న చనిపోయాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. తమ మిత్రుడు చనిపోయాడన్న విషయం తెలుసుకున్న అతని స్నేహితులు ఆర్థికంగా సహాయం చేయాలనుకున్నారు. స్నేహితులు భిక్షపతి, బాలరాజు‌గౌడ్ పండు, కుమార్, శేఖర్ గౌడ్, మల్లేష్, ఆకాష్ మహేందర్, సురేష్ గౌడ్, మల్లేష్, గౌస్, రాజు, ఆంజనేయులు కలిసి మిత్రుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

Advertisement

Next Story