- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయ్యా కేసీఆర్ సారూ.. ఇగ మాకు ఇండ్లు ఇయ్యరా..?
దిశ, మణుగూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతుందని సంబురపడ్డారు. కానీ, ఆ సంబురం మూడునాల్లా ముచ్చటే అవుతుందని అనుకోలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో ప్రజలకు ఇల్లు లేక నరకయాతన పడుతున్నారు. అయ్యా కేసీఆర్ సారూ.. మాకు ఇల్లు ఇయ్యారా? అని ప్రజలు అరుపులతో రోడ్లపైకి వచ్చారు. ఈ వర్షాకాలంలో గాలివానకు, ఈదురుగాలులకు ఇంటి పైకప్పులు రేకులు, గుడిసెలు ఎగిరిపోతున్నాయని గ్రామప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉన్న ప్రజలకు ఇల్లు కట్టుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు తప్పట్లేదు. కరోనా కారణంగా పనులు లేక బయటకు పోలేక, తినటానికి తిండిలేక కాలం వెల్లదీస్తున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఇలాంటి సమయంలో వర్షాలు, ఈదురు గాలులకు ఇంటి పైకప్పులు లేచిపోతున్నా మళ్లీ చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి ఆ గ్రామ ప్రజలకు ఏర్పడింది.
వర్షం కురిస్తే ఇళ్లల్లోనే తడిసి పోతున్నామని, బయటకు వెళితే ఉరుములు, మెరుపులు పడుతున్నాయని వివరించారు. తమ గ్రామాన్ని పట్టించుకునే నాధుడే లేడని ప్రజలు తగ గోడు వెల్లబోసుకున్నారు. ఏ అధికారికీ తమ బాధలు చెప్పినా పట్టించుకోవడంలేదని, ఇంత జరుగుతున్నా ఎవరూ గ్రామం వైపు కన్నెత్తి చూడడం లేదన్నారు. తెలంగాణ వస్తే ఇళ్లు వస్తాయని ఎంతో ఆశతో ఎదురుచూశాం. కానీ, తెలంగాణ వచ్చినా ఇంతవరకు తమకు ఒరిగిందేమీ లేదని మల్లెలమడుగు వాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం మల్లెల మడుగు గ్రామంపై దృష్టిసారించి ఇళ్లు లేని ప్రజలను ఆదుకోవాలని గ్రామప్రజలు, అఖిలపక్ష సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు,
పలువురు కోరుతున్నారు.