ప్రాణాంతకంగా మారుతున్న బ్లాక్ ఫంగస్

by Shyam |
ప్రాణాంతకంగా మారుతున్న బ్లాక్ ఫంగస్
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : కొవిడ్ వ్యాధితో ఒక వైపు దేశమంతా భాదపడుతుంటే మరో వైపు బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రాణాంతకంగా మారుతోంది. కరోనా సోకి తగ్గిన వారు, ఇతరత్రా దీర్ఘకాలిక సమస్యలతో భాదపడుతున్న వారిలోనూ, మధుమేహం (చక్కెర వ్యాది) ఎక్కువగా ఉండి నియంత్రణలో లేని వారికి, వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వారిలో బ్లాక్ ఫంగస్‌గా పిలువబడే మ్యూకర్ మైకోసిస్ వ్యాధి అధికంగా కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో అతితక్కువ సమయంలోనే ఫంగస్ ముక్కు, సైనస్ ల నుంచి కళ్లకు . మెదడుకు పాకి ప్రాణానికి ప్రమాదంగా పరిగణిస్తోంది. అయితే ఈ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి శస్త్ర చికిత్స, తగిన మందులు వాడడం వలన వ్యాప్తిని అరికట్టవచ్చు.

నానాటికీ ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధి కేసులు ఎక్కువ అవుతున్న నేపధ్యంలో ఇలాంటి వారికి సరైన చికిత్స అందించడానికి అండగా నిలబడి అవసరమైన వైద్య సహాయం అందించాలని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వైద్య బృందం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఈఎన్టీ, హెడ్ & నెక్ విభాగంలోని శస్త్ర చికిత్స నిపుణులు, న్యూరో సర్జన్స్, ఆప్తమాలజీ సర్జన్స్, ఐసీయూ, అనస్థీషియా, ఇంటర్నల్ మెడిసన్, మెడికల్ ఆంకాలజీ, డయాబెటాలజీ, మైక్రో బయాలజీ వైద్యులతో కూడిన బృందం ఏర్పాటు చేసి సమగ్రమైన చికిత్స అందించడానికి నిర్ణయించింది. ప్రత్యేకంగా వైద్య కేంద్రాన్ని నెలకొల్పి బ్లాక్ ఫంగస్ వ్యాధికి అవసరమైన చికిత్స అందజేస్తారు.

ఈ వ్యాధితో భాదపడుతున్న వారు తగిన సమాచారం కోసం 040-23551235, 040-23556655 నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా హెడ్ & నెక్ విభాగాన్ని సంప్రదించవచ్చని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed