పాలిస్తున్న మేకపోతు

by Shamantha N |   ( Updated:2020-07-29 10:34:01.0  )
పాలిస్తున్న మేకపోతు
X

దిశ, వెబ్ డెస్క్: ఎక్కడైనా ఆవు, గెదే, మేక పాలు ఇవ్వడం సాధారణం. అయితే మేకపోతు కూడా పాలు ఇస్తుందంటా! ఇది నమ్మశక్యంగా లేనప్పటికీ నిజంగానే పాలిస్తుంది. ఈ వింత ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. ఢోల్‌పూర్‌లోని గుర్జా గ్రామానికి చెందిన రాజీవ్ కుశ్వాహ ఓ మ‌గ‌ మేక‌‌ను పెంచుకుంటున్నాడు.

అది పాలిస్తుందని గ్రహించి ఆశ్చర్యానికి గురయ్యాడు.

ఆయ‌న మాటల్లోనే.. “మేకపోతును రెండున్న‌ర నెల‌ల వ‌య‌సు ఉన్న‌ప్పుటి నుంచి పెంచుకుంటున్నాం. ఆరు నెల‌ల వ‌య‌సొచ్చేసరికి మేకపోతుకు పొదుగులు వ‌చ్చాయి. ప్రస్తుతం రోజుకు 200- 250 గ్రాముల పాల‌ను ఇస్తుంది.” అని దాని యజమాని తెలిపారు. హార్మోన్ల స‌మ‌తుల్య‌త లోపించ‌డం వ‌ల్లే ఇలా జ‌రుగుతుంద‌ని, ఇలాంటి కేసులు ల‌క్ష‌ల్లో ఒకటి వెలుగు చూస్తాయ‌ని వెట‌ర్న‌టీ స‌ర్జ‌న్ జ్ఞాన్ ప్ర‌కాశ్ స‌క్సేనా వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed