సినీ ఇండస్ట్రీలో మరో విషాదం

by Sumithra |   ( Updated:2021-01-03 12:01:02.0  )
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం
X

దిశ, వెబ్ డెస్క్ : మలయాళ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత సాజీ పాండవత్‌ (63) కన్నుమూశారు. ఆయన ఆదివారం గుండె సంబంధిత వ్యాధి కారణంగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో మృతి చెందినట్లు ఫెఫ్కా డైరెక్టర్స్ యూనియన్ తన ఫేస్‌బుక్‌లో వెల్లడించింది. దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయిత సాజీ పాండవత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆదివారం గుండె సంబంధిత వ్యాధి కారణంగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో మృతిచెందారు. ఇటీవలే గుండె శస్త్ర చికిత్స చేయిందుకున్నారు. అనంతరం ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సాజీ పాండవత్ మృతిపట్ల పలువురు సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు.

Advertisement

Next Story