- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ప్రధాన ఓడరేవుల్లో సరుకు తగ్గింది
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా భారత్‌లోని టాప్ 12 పోర్టులలో కార్గో ట్రాఫిక్ గణనీయంగా క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి భాగంలో కార్గో ట్రాఫిక్ క్షీణత వల్ల 12 పోర్టులు 14 శాతం తగ్గి 298.55 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించాయని ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్(ఐపీఏ) తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్‌లో 348.23 మెట్రిల్ టన్నుల నిర్వహణ జరగ్గా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో వరుసగా ఆరో నెల తగ్గాయని ఐపీఏ పేర్కొంది.
కరోనా వైరస్ అంతరాయాల వల్ల ప్రధాన అన్ని ఓడరేవులు ప్రతికూల వృద్ధిని సాధించాయి. చెన్నై, కొచ్చిన్ లాంటి ఓడరేవులు తమ కార్గో వాల్యూమ్‌లను ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో 20 శాతానికి పైగా తగ్గించాయని ఐపీఏ వెల్లడించింది. కోల్‌కతా, ముంబై ఓడరేవుల్లో 15 శాతానికిపైగా క్షీణించాయి. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఇతర వస్తువుల్లో కంటైనర్లు, బొగ్గు, పెట్రోలియ, చమురు నిర్వహణలో గణనీయమైన క్షీణత కనిపించినట్టు ఐపీఏ తెలిపింది. ఈ నౌకాశ్రయాలు దేశంలోని మొత్తం సరుకు రవాణాలో 61 శాతం నిర్వహిస్తాయి. గతేడాది ఈ ఓడరేవులు మొత్తం 705 మెట్రిక్ టన్నుల సరుకును నిర్వహించాయి.