- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
దిశ ప్రతినిధి, నల్లగొండ: సీసీఐ కొనుగోలు కేంద్రంగా ఉన్న ఓ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామంలోని వరలక్ష్మి కాటన్ మిల్లులో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఈ మిల్లు సీసీఐ కొనుగోలు కేంద్రంగా ఉండడంతో భారీ పత్తి నిల్వలు ఉన్నాయి. దీనికితోడు పరిసర గ్రామాల నుంచి సైతం రైతులు పత్తిని విక్రయించేందుకు జిన్నింగ్ మిల్లుకు తీసుకొచ్చారు. దీంతో చాలా మొత్తంలో పత్తి అగ్నికి ఆహుతి అయింది. సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు మిల్లుకు చేరుకుని ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గురైన పత్తి నిల్వలు సీసీఐ అధికారులు కొనుగోలు చేసినవి కావడం గమనార్హం. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాగా భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.