మహేశ్‌తో మరోసారి..

by Shyam |
మహేశ్‌తో మరోసారి..
X

సూపర్‌స్టార్ మహేష్‌బాబు 27వ సినిమాపై ఈ నెల 31న అధికారిక ప్రకటన ఉండబోతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా కియారా అద్వానీ ఎంపిక కాగా సంగీతం ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మధి. లాక్‌డౌన్ ఎత్తేయగానే షూటింగ్ ప్రారంభిస్తారట. జూన్‌లో షూటింగ్ స్టార్ట్ అయితే.. 2021 సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు నిర్మాతలు.

మే 31 కృష్ణ పుట్టినరోజున అభిమానులకు ఈ ప్రాజెక్ట్ గురించి తీపి కబురు అందనుంది. భరత్ అను నేను సినిమా తర్వాత ‘కియారా అద్వానీ’ మళ్లీ ఈ సినిమాలో మహేశ్ సరసన నటించనుంది. కాగా ఈ సినిమాతో మహేశ్ మరోసారి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని.. స్క్రిప్ట్ అంత పకడ్బందీగా ఉందని టాక్.

మహేష్ 27వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాల్సి ఉండగా స్క్రిప్ట్ రెడీ కాకపోవడంతో మహేశ్.. పరశురామ్‌కు చాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story