మహారాష్ట్ర మంత్రికి రెండోసారి కరోనా.. సీఎం భార్యకు కూడా పాజిటివ్

by vinod kumar |
Dhananjay Munde
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉధృతి వేగంగా కొనసాగుతున్నది. రాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండేకు రెండోసారి కరోనా సోకడం గమనార్హం. సోషల్ జస్టిస్ మినిస్టర్‌గా ఉన్న ధనంజయ్.. గతేడాది జూన్‌లో కూడా కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా తనకు మరోసారి కరోనా సోకినట్టు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనతో కాంటాక్ట్ అయినవాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు.

సీఎం భార్యకూ కరోనా..

maharashtra cm wife rashmi

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే భార్య రష్మి థాక్రే కు కొవిడ్ నిర్ధారణ అయింది. పది రోజుల క్రితమే ఆమె తన భర్తతో కలిసి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె హోంక్వారంటైన్‌లో ఉన్నారు. నాలుగు రోజుల క్రితమే ఉద్ధవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రేకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story