రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలు.. నా పరువు గంగలో కలిపేస్తున్నారుగా

by Shamantha N |
రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలు.. నా పరువు గంగలో కలిపేస్తున్నారుగా
X

దిశ,వెబ్‌డెస్క్: మహరాష్ట్ర హోంగార్డ్ విభాగానికి డీజీగా ఉన్న పరమ్ బిర్ సింగ్ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై అవినీతి ఆరోపణలు చేశారు. నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీస్ శాఖ కు చెందిన అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పరమ్ బిర్ సింగ్.., సీఎం ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాశారు. ఆ లేఖపై అనిల్ దేశ్ ముఖ్.., పరమ్ బిర్ సింగ్ పై మండిపడ్డారు. తనపై పరమ్ బిర్ సింగ్ చేసిన రూ.100 కోట్ల అవినీతి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, అందుకే పరమ్ బిర్ సింగ్ పై పరువు నష్టం దావావేస్తున్నట్లు మహరాష్ట్ర హోమంత్రి అనిల్ దేశ్ ముఖ్ స్పష్టం చేశారు.

ముఖేష్ అంబానీ ఇంటి ‘యాంటీలియా’ భద్రత విషయంలో మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బిర్ సింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, అందుకే అతనికి హోంగార్డ్ డీజీగా బాధ్యతలు అప్పగించిన విషయాన్ని మరాఠ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హోమంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. ముఖేష్ అంబానీని ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్,అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సచిన్ వాజే బెదిరించడంలో పరమ్ బిర్ సింగ్ ప్రమేయం ఉందని, అందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని అనిల్ దేశ్ ముఖ్ ట్వీట్ చేశారు.

ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలున్న ఎస్ యూవీని సచిన్ వాజ్‌ వినియోగించారని ఎన్ ఐఏ అధికారులు నిర్ధారించారు. ఆ ఎస్ యూవీ వాహనం థానేకు చెందిన వ్యాపారవేత్త మన్సుఖ్ హిరెన్‌కు చెందింది.

అంబానీ ఇంటి దగ్గర నుండి ఎస్‌యూవీని స్వాధీనం చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు మన్సుఖ్ హిరెన్ నుంచి దొంగతనం చేసినట్లు నివేదికలో తేలింది. మార్చి 5 న ముంబైకి సమీపంలో హిరెన్ అనుమానాస్పదంగా చనిపోయాడు. ముఖేష్ అంబానీ ఇంటి వ్యవహారం, మన్సుఖ్ మరణంలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్, మాజీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సచిన్ వాజే, మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బిర్ సింగ్ హస్తం ఉంది. అందుకే మహరాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా పరమ్ బిర్ సింగ్ వ్యవహరిస్తున్నారని, హోమంత్రి అనిల్ దేశ్ ముఖ్ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed