బిదరెల్లి వద్ద ‘మహా’ చెక్‌పోస్ట్

by Aamani |
బిదరెల్లి వద్ద ‘మహా’ చెక్‌పోస్ట్
X

దిశ, ఆదిలాబాద్: కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు రాష్ట్ర సరిహద్దుల్లో మన ప్రభుత్వం మాత్రమే చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. తాజాగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండటం, తెలంగాణ ప్రాంతం నుంచి కూలీలు మహారాష్ట్రకు రాకపోకలు సాగిస్తుండటంతో చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నిర్మల్ జిల్లా బాసర మండలం బిదరెల్లి వద్ద అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed