- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాయ్‌గడ్‌కు రూ. 100 కోట్ల తక్షణ సహాయం: ‘మహా’ సీఎం
ముంబై: నిసర్గ తుఫాన్‌తో నష్టపోయిన రాయ్‌గడ్ జిల్లాకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రూ. 100 కోట్ల తక్షణ సహాయాన్ని ప్రకటించారు. నిసర్గ తుఫాన్ వల్ల అతలాకుతలమైన రాయ్‌గడ్ జిల్లాలో పర్యటిస్తూ సీఎం ఈ ప్రకటన చేశారు. ఆ జిల్లా అలీబాగ్ తాలూకాలో పర్యటించిన సీఎం రాయ్‌గడ్‌కు తక్షణ సహాయంగా రూ. 100 కోట్లను అందిస్తున్నట్టు తెలిపారు. అయితే, దీంతో సహాయానికి ఫుల్‌స్టాప్ పెట్టినట్టు కాదనీ, నష్ట అంచనాలు జరుగుతున్నాయని, అనంతరం తగినమొత్తంలో సహాయాన్ని ప్రకటిస్తారని వివరించారు. రాయ్‌గడ్ జిల్లాలాగే ఇతర జిల్లాలకూ సహాయం అందుతుందని తెలిపారు. ముంబైని వదిలేసిన నిసర్గ తుఫాన్ రాయ్‌గడ్ సహా పలు జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చెట్లు, కరెంట్ పోల్స్ పెకిలి వచ్చాయి. ఆరుగురు చనిపోయారు. ఈ తుఫాన్ కారణంగా మరణించినవారి కుటుంబ సభ్యులకు నాలుగు లక్షల పరిహారాన్ని అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.