- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రాహ్మణుడు కాదు.. బ్రహ్మ రాక్షసుడు.. మహాదేవ్ స్వామీజీ సంచలన వ్యాఖ్యలు
దిశ, కామారెడ్డి: బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రహ్మణుడని, బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నిరంజన్ దేశాయ్ బ్రహ్మణుడిలా కాదు.. బ్రహ్మ రాక్షసుడిలా మాట్లాడుతున్నారని గాంధారి మండలం గుడిమెట్ మహాదేవుని ఆలయ గురూజీ మహాదేవ్ స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన కామారెడ్డి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ.. బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షడు నిరంజన్ దేశాయ్ జంగమ పూజారుల పట్ల మాట్లాడిన తీరును ఖండించారు. గజ్వేల్‌లో ఓ జంగమ పూజారి చేసిన దొంగతనం తప్పేనని, దానిని దృష్టిలో పెట్టుకొని మొత్తం జంగమ కులస్తులు దొంగలుగా నిరంజన్ దేశాయ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మాట్లాడిన తీరు ఆక్షేపనియమని అన్నారు.
తమలో ఒకరు చేసిన దొంగతనానికి అతను శిక్ష అనుభవిస్తాడని, దానిపై నిరంజన్ దేశాయ్ జంగములు దొంగలుగా మాట్లాడటం మూర్ఖత్వానికి నిదర్శనమని తెలిపారు. జంగముల మొత్తాన్ని దొంగలుగా చిత్రీకరిస్తూ మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు తప్పు చేస్తే ఆ వ్యక్తి గురించే మాట్లాడాలి తప్ప దానికి సమాజం మొత్తాన్ని బాధ్యులను చేస్తారా? అని ప్రశ్నించారు. బ్రహ్మణులలో కూడా తప్పు చేసిన వారు ఉన్నారని, అలాగని తప్పు చేసినా వారిని దృష్టిలో పెట్టుకుని బ్రహ్మణులు మొత్తం తప్పు చేస్తారని మాట్లాడటం సబబు కాదని చెప్పారు. అలా మాట్లాడితే సంస్కార హీనులుగా మిగిలిపోతారని అన్నారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడని, దీక్ష సంస్కారం, ఉపనయనుడు అయినవాడే బ్రాహ్మణుడు అవుతాడని పేర్కొన్నారు.
నిరంజన్ దేశాయ్ బ్రహ్మణుడిలా కాకుండా బ్రహ్మ రాక్షసుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సమాజంలో బ్రాహ్మణులు తప్ప ఇతరులు పౌరోహిత్యం చేయొద్దన్నట్టు మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రపంచంలో బ్రాహ్మనులు ఒక్కరే లేరని, వేదం నేర్చుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, దానిని కించపరచడం సరికాదన్నారు. మరోసారి జంగమ కులస్తుల పట్ల తప్పుగా మాట్లాడితే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ పట్ల నిరంజన్ దేశాయ్ మాట్లాడిన విధానాన్ని మాత్రమే తప్పుబడుతున్నామని, బ్రాహ్మణ సంఘం మొత్తాన్ని మేము అనడం లేదని స్పష్టం చేశారు. బ్రాహ్మణులు ఇది గుర్తించి తప్పుగా భావించొద్దని విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో మహాదేవ్ స్వామీజీ శిష్యులు అనిరుద్ స్వామి, పవన్ స్వామి ఉన్నారు.