- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహబూబ్‌నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యే
దిశ, మహబూబ్ నగర్: మహబూబ్‌నగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టే ముందు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఎర్ర శేఖర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎర్రశేఖర్ మాట్లాడుతూ.. పార్టీ జిల్లా అధ్యక్షునిగా తనను నియమించిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సేవకు తన జీవితం అంకితం అని అన్నారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని అన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషిచేస్తానని అన్నారు. జిల్లా రాబోయే ఎన్నికల్లో పార్టీ అధిక సీట్లు గెలిచేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డికె.అరుణ, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్, మాజీ జిల్లా అధ్యక్షురాలు పద్మాజారెడ్డి, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.