కలెక్టర్ ఆగ్రహం : ఒకేసారి 12 మంది జిల్లా అధికారులకు నోటీసులు

by Shyam |
mahaboob-nagar-collecter -1
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : కరోనా, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమీక్షా సమావేశానికి గైర్హాజరు అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ 12 మంది జిల్లా స్థాయి అధికారులకు మహబూబ్ నగర్ కలెక్టర్ వెంకట్రావు కొరడా ఝుళిపించారు. సోమవారం రాత్రి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో హరితహారం, రైతుబంధు తదితర పథకాలతో పాటు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.

కానీ, ఏకంగా 12 శాఖలకు సంబంధించిన అధికారులు గైర్హాజరు కావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ, ఇంటర్ విద్యాశాఖ అధికారి, ఆర్ అండ్ బీ జిల్లా అధికారి, టిఎస్‌ఎమ్ ఐడీసీఈ, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి, సీపీఓ, సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా కో-ఆర్డినేటర్లు, ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒక్కసారిగా కలెక్టర్ 12 మంది జిల్లా స్థాయి అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి ఆదేశించడంతో ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed