- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతి
దిశ వెబ్‌డెస్క్: టీడీపీలో విషాదం చోటుచేసుకుంది. ఏలూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం రాంజీ అనారోగ్యానికి గురికావడంతో.. ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి బంధువులు తరలించారు. అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రాంజీ గుండెపోటుకు గురికావడంతో.. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్‌కి తరలించారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత విషమించడంతో రాంజీ మరణించారు.
రాంజీ మృతితో టీడీపీ శ్రేణులు విషాదంలోకి వెళ్లిపోయారు. టీడీపీలో యువనేతగా రాంజీకి మంచి పేరు ఉంది. అందరితో కలివిడిగా ఉంటూ విబేధాలకు చాలా దూరంగా ఉంటారనే పేరుంది. అలాంటి మంచి మనిషి ఇప్పుడు తమ ముందు లేకపోవడం బాధాకరమని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చెబుతున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా రాంజీకి పేరుంది. ఈ క్రమంలో రాంజీ మృతికి నారా లోకేష్ సంతాపం ప్రకటించారు. ‘లోకేష్ అన్నా అంటూ పిలిచే ఆ పిలుపు ఇక వినపడదు .మాగంటి రాంజీ మనకి దూరం అయిపోయాడు. తెలుగుదేశానికి అండగా ఉంటానంటూ జెండా పట్టిన పసుపు సైనికుడా నీ మరణం పార్టీకీ,నాకూ తీరని లోటు. కన్నీటి నివాళి అర్పిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ లోకేష్ కన్నీళ్లుమున్నీళ్లు అయ్యారు.