ఇళయతలపతికి మద్రాసు హైకోర్టు భారీ షాక్.. మీరే ఇలా చేస్తే ఎలా అంటూ..!

by Jakkula Samataha |
vijay-talapathy
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇళయతలపతి విజయ్‌కు భారీ షాక్ తగిలింది. 2012లో విజయ్ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారుకు పన్ను మినహాయించాలని వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తప్పుబట్టింది. అంతేకాకుండా ఆయన వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న కారుకు తప్పనిసరిగా టాక్స్ కట్టాల్సిందేనని న్యాయమూర్తి ఎం సుబ్రమణియమ్ తెగేసి చెప్పారు. అంతేకాకుండా రీల్ హీరోలు పన్ను కట్టేందుకు వెనుకాడుతున్నారంటూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

పిటిషన్ పేరుతో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు గానూ రూ.లక్ష జరిమానా విధించింది. విజయ్ కట్టే జరిమానాను కరోనా రిలీఫ్ ఫండ్‌ కోసం వినియోగించాలని న్యాయమూర్తి తెలిపారు. కాగా, విజయ్ లాంటి హీరోలు ట్యాక్స్ ఎగ్గొ్ట్టే ప్రయత్నాలు చేస్తే ఎలా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇదిలాఉండగా ఒక్కో సినిమాకు రూ.కోట్లలో పారితోషికం తీసుకునే విజయ్ దిగుమతి సుంకం మినహాయించాలని కోర్టులో పిల్ వేయడం హాస్యాస్పదంగా ఉందని పలువురు అనుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed