- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనూ.. నువ్వు సూపర్ మ్యాన్ : మాధవన్
సోనూ సూద్.. దేశం మొత్తం ప్రశంసిస్తున్న ఒకే ఒక్క పేరు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సహాయపడుతున్న మానవతామూర్తి. కలి కాలంలోనూ ఇలాంటి మనుషులు ఉంటారా? అన్న ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనం. కష్టపడుతూ ఎవరు కనిపించినా తట్టుకోలేని మృదు స్వభావి అయిన సోనూ.. ఎడ్లు కొనే స్థోమత లేక ఏపీలో ఇద్దరు ఆడపిల్లలతో దుక్కి దున్నిస్తున్న వార్త చూసి చలించిపోయాడు. సాయంత్రం కల్లా ఆ ఆడపిల్లలకు ట్రాక్టర్ కొనిచ్చి సొంత అన్నయ్య అయిపోయాడు. ఈ క్రమంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుచే శభాష్ అనిపించుకున్నారు.
లాక్‌డౌన్‌లో వలస కూలీలను ఇంటికి చేర్చేందుకు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించి రియల్ హీరో అయిపోయిన సోనూ.. తాజాగా లాక్‌డౌన్ కారణంగా కిర్గిస్తాన్‌లో ఇరుక్కుపోయిన విద్యార్థులను ఇంటికి చేర్చేందుకు ఏకంగా ఫ్లైట్ అరేంజ్ చేశాడు. అక్కడి నుంచి ప్రతీ స్టేట్‌కు ఒక్కో రోజు ఫ్లైట్ అందుబాటులో ఉంచుతూ స్టూడెంట్స్‌ను ఇళ్లకు చేరుస్తున్నారు సోనూ. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎవర్ గ్రీన్ యాక్టర్ మాధవన్ సోనూ సూద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సోనూను చూస్తుంటే గర్వంగా ఉందన్న మాధవన్.. నిజంగా నువు సూపర్ మ్యాన్ బ్రదర్ అంటూ కొనియాడాడు.
https://twitter.com/ActorMadhavan/status/1287349748509241344?s=19