కేసీఆర్ తుంపిర్లకు భయపడే వారెవరూ లేరు: దుబ్బాక ఎమ్మెల్యే

by Shyam |   ( Updated:2021-12-19 04:41:58.0  )
కేసీఆర్ తుంపిర్లకు భయపడే వారెవరూ లేరు: దుబ్బాక ఎమ్మెల్యే
X

దిశ, శేరిలింగంపల్లి: సీఎం కేసీఆర్ కు మతి భ్రమించిందని అందుకే బీజేపీని ఉరికించి కొట్టుర్రి, ఊరి ఊరికి చావు డప్పు కొట్టుర్రి అంటూ నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఆదివారం గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లిలో మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, రాష్ట్ర బీజేపీ నాయకులు రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దుబ్బాక శాసన సభ్యులు మాధవనేని రఘునందన్ రావు చేతుల మీదుగా మాదాపూర్ లోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీలో జాయిన్ అయ్యారు.

ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు. కేవలం దొర అహంకార నియంత పాలననే నడుస్తుందని అన్నారు.కేసీఆర్ తుంపిర్లకు భయపడే వారెవరూ లేరు అన్నారు. కేసీఆర్ అహంకారానికి హుజురాబాద్ ఎన్నికలే నిదర్శనం అని అన్నారు. రాజకీయాల్లో నిజాయితీ నీతి నిబద్దత ముఖ్యం అని ఈ నియంత పాలన పైన తిరుగుబాటు బావుట ఎగరవేయాలని, దేశంలో క్రమశిక్షణకు మారుపేరు అయినా బీజేపీ కార్యకర్తల త్యాగాలు మరువలేనివని అన్నారు.

తెలంగాణలో రాబోయే ప్రభుత్వం బీజేపీ దే అని అందుకు కార్యకర్తలు సిద్ధమై ప్రజల్ని మేలుకొల్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నేతలు, శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story