చెల్లిని చంపింది ఆమెనే.. శవం చుట్టూ నగ్నంగా పేరెంట్స్ పూజలు!

by Anukaran |
చెల్లిని చంపింది ఆమెనే.. శవం చుట్టూ నగ్నంగా పేరెంట్స్ పూజలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లా మదన పల్లెలో జరిగిన జంటహత్యల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన ఇంట్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా కేసు మరో మలుపు తిరిగింది. ఇన్నిరోజులు తల్లిదండ్రులే తమ ఇద్దరు కూతుర్లను చంపారని భావించిన పోలీసులకు షాక్ తగిలింది. వివరాల్లోకివెళితే.. పద్మజ చిన్నకూతురు దివ్యకు ఆదివారం సాయంత్రం ఇంట్లో దెయ్యం కనిపించిందని పలుమార్లు కేకలు పెట్టింది. చెల్లిను చూసి అక్క అలేఖ్య కూడా వింతగా ప్రవర్తించడంతో తమ కూతుర్లకు దెయ్యం పట్టిందని తల్లి మంత్రగాళ్లను పిలిపించింది.

తాంత్రికులు ఇద్దరు అమ్మాయిలకు తొలుత రుద్రాక్ష మాలలను వేసి పూజలు చేశారు. ఇంటి చుట్టూ నిమ్మకాయలు కట్టి, నాలుగు రోజులుగా క్షుద్రపూజలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, పూజ జరుగుతున్న క్రమంలో దివ్య తలపై అలేఖ్య డంబెల్‌తో కొట్టి చంపింది.అనంతరం మృతదేహం చుట్టు తల్లి పద్మజ, తండ్రి పురుషోత్తం, అక్క అలేఖ్య నగ్నంగా పూజలు చేశారు. ఆ తర్వాత చెల్లి ఆత్మను తిరిగి తెస్తానంటూ తన ప్రాణం తీయాలని అలేఖ్య కోరండంతో కలశాన్ని నోటిలో పెట్టి పెద్ద కూతురి తలపై అదే డంబెల్‌తో పద్మజ కొట్టి చంపింది. ఈ తతంగమంతా సీసీ టీవీలో రికార్డు కాగా, వాటిని కలెక్ట్ చేసుకుని పోలీసులు రహస్యంగా ఉంచారు. ఈ కేసు విషయంలో మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed