- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'గంగూలీని ఓపెనింగ్ చేయమని నేనే చెప్పా'
దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఓపెనర్‌గా వచ్చిన తర్వాతే కెరీర్ బాగా పుంజుకుందని, అతనికి ఓపెనింగ్ చేయమని సలహా ఇచ్చింది తానేనని భారత జట్టు మాజీ కోచ్ మదన్ లాల్ చెప్పారు. 1983 ప్రపంచ కప్ జట్టు సభ్యుడైన్ మదన్‌లాల్ 1996లో భారత జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. అప్పుడే జట్టులోకి వచ్చిన గంగూలీని బాగా ఉపయోగించుకోవాలని జట్టు యాజమాన్యం భావించింది. ఆ భారం మదన్‌లాల్‌పై పెట్టింది. అప్పటివరకు 5వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న గంగూలీ వద్దకు వెళ్లిన మదన్‌లాల్ ఓపెనింగ్‌కు దిగమని సలహా ఇవ్వగానే అతను కూడా ఒప్పుకున్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన మదన్‌లాల్ ఆ విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘దాదాకు ఆ విషయం గుర్తుందో లేదో తెలియదు. కానీ, నువ్వు 5వ స్థానంలో బ్యాటింగ్ చేస్తే జట్టుకు, నీకు లాభం లేదు. ఇక నుంచి ఓపెనర్‌గా వెళ్లు’ అని చెప్పినట్లు పేర్కొన్నారు. గంగూలీ బ్యాటింగ్ స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అతనిలో అన్నిరకాల షాట్లు ఆడగల సామర్థ్యం ఉంది అని మదన్ లాల్ వెల్లడించారు. కాగా, దాదా ఓపెనర్ కాకముందు 10 వన్డేల్లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. 1996లో దక్షిణాఫ్రికాతో జైపూర్‌లో జరిగిన వన్డేలో తొలిసారిగా ఓపెనింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో దాదా అర్ధ సెంచరీ చేయడం గమనార్హం.