తెలంగాణలో పెగాసెస్.. ఫోన్ టాపింగ్‌ చేస్తున్నారన్న కోదండరాం

by Shyam |
తెలంగాణలో పెగాసెస్.. ఫోన్ టాపింగ్‌ చేస్తున్నారన్న కోదండరాం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం పెగాసెస్ వినియోగిస్తూ దొంగచాటు చర్యలకు పాల్పడుతూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఫోన్ టాపింగ్‌‌కు పాల్పడుతున్నదని తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఇవన్నీ అనైతిక చర్యలని వ్యాఖ్యానించారు. వ్యక్తుల మధ్య జరిగే టెలిఫోన్ సంభాషణలను ఏ రూపంలో వింటున్నా, నిఘా వేసినా అది రాజ్యాంగ విరుద్ధమైన చర్యే అవుతుందని అన్నారు. హైదరాబాద్‌లో శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్రజల కోసం పనిచేసే మానవ హక్కుల కార్యకర్తలు, నేతలతో పాటు అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను, జర్నలిస్టుల సంభాషణలను రాష్ట్ర ప్రభుత్వం టాపింగ్ చేస్తున్నదని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజల గోప్యతా హక్కును హరించడమేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఫోన్ టాపింగ్ విఘాతం కల్గిస్తున్నదన్నారు. ఫోన్ టాపింగ్, పెగాసెస్ లాంటి వాటి ద్వారా వ్యక్తుల టెలిఫోన్ సంభాణలపై నిఘా వేయడం అప్రజాస్వామిక, అనైతిక, అనాగరిక చర్యలని అభివర్ణించారు.

Advertisement

Next Story