ప్రేమ వివాహం చేసుకున్న లవర్స్.. నేరుగా అక్కడి వెళ్లి..

by Shyam |
Lovers
X

దిశ,ఎల్లారెడ్డి: ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆశ్రయించారు. ఎల్లారెడ్డి మండలంలోని అల్మాజీపూర్ గ్రామానికి చెందిన మీనా, మల్కాపూర్ గ్రామానికి నరేష్ డిగ్రీ క్లాస్ మెంట్స్. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఈ జంటకు కులాలు వేరని ఇరుకుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో నరేష్, మీనా శుక్రవారం పట్టణంలో ఓ ఆలయంలోని పెళ్లి చేసుకున్నారు. అనంతరం తమకు అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, వారి నుండి రక్షణ కల్పించాలని ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్వేత వారి వివరాలు సేకరించి మేజర్లుగా గుర్తించారు. వారికి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story