ఖండాలు దాటినా తరగని ప్రేమ.. ఇద్దరు ఒక్కటయ్యారిలా?

by Anukaran |
ఖండాలు దాటినా తరగని ప్రేమ.. ఇద్దరు ఒక్కటయ్యారిలా?
X

దిశ, వెబ్‌డెస్క్ : వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఉద్యోగం వేటలో ప్రియుడు గల్ఫ్ దేశానికి వెళ్లాడు. తిరిగి రాగానే ఒకటవుదాం అనుకున్నారు. కానీ పెద్దల నిర్ణయం వారి నిర్ణయాలను మార్చాయి. ఒకరిని వదిలి మరొకరు ఉండలేక ఇద్దరు ఒకటయ్యారు. ఇంతకు ఎలా ఒకటయ్యారంటే..

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన రాకేష్, గోవిందుపల్లికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెళ్లికి తొందరేం లేదని, ఆర్థికంగా బలపడిన తర్వాతే ఇరువైపుల తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా రాకేష్ ఏడాది క్రితం ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు.

అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెలియని యువతి తల్లిదండ్రులు ఆమెకు వేరే యువకుడితో పెళ్లి సంబంధం చూశారు. తమ ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పలేక.. ప్రియుడిని మర్చిపోయి మరొకరిని వివాహం చేసుకోలేక ఆమె రెండు రోజుల క్రితం ఇంట్లో ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న రాకేష్.. ప్రియురాలు లేనిది నేనూ బతకలేనని తన తల్లికి వీడియో కాల్ చేసి దుబాయ్ లోని ఆయన గదిలో ప్రియురాలి మాదిరిగానే ఉరేసుకోని ప్రాణం తీసుకున్నాడు. ప్రస్తుతం అతడి వీడియో జిల్లాలో వైరల్ గా మారింది.

Advertisement

Next Story