లవ్లీ స్పాట్స్​.. వాలంటైన్​డే స్పెషల్

by Shyam |
Lovely spots in Hyderabad
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: నవతరం ప్రేమికులు రొమాంటిక్‌ టూర్‌ను వైవిధ్యంగా జరుపుకుంటున్నారు. తాము ఈసారి గోవా వెళ్లబోతున్నామని మూడేళ్లుగా డీప్‌ లవ్‌లో ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి రాహుల్ తెలిపారు. కేవలం రాహులే మాత్రమే కాదు ఎక్కువ మంది నగర యువత గోవాకే వెళ్తున్నారని చెబుతున్నారు కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ప్రతినిధులు. గోవా తరువాత నగర యువత ఇష్టపడుతున్న ప్రదేశాల్లో కూర్గ్‌, ఉదయ్‌పూర్‌, షిల్లాంగ్‌, పంచ్‌మర్హీ వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ సారి ఫిబ్రవరి 13, 14 తేదీలు సెలవు(రెండో శనివారం,ఆదివారం) దినాలు కావడంతో తమ టూర్లను ప్లాన్‌ చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. భాగ్యనగరంలోనూ ప్రేమికులను ఆకట్టుకునే లవర్స్​స్పాట్స్​ఎన్నో ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లలేని ప్రేమికుల కోసం నగరంలోని అందమైన ప్రాంతాలు ఆహ్వానం పలుకుతున్నాయి.

KBR Park

గతేడాది కరోనా భయంతో ప్రేమికులు ఇల్లు దాటి బయటకు వెళ్లలేదు. దీంతో ప్రేమ పక్షులు తమ టూర్లను వాయిదా వేసుకున్నారు. కానీ, ఈ సారి కరోనా ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టడంతో ప్రేమ జంటలు ప్రేమికుల రోజున ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే టూర్లకు వెళ్లేందుకు టికెట్స్‌ బుక్‌ చేసుకున్న వారు 20 శాతం పెరిగినట్లు మారుతీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధులు చెబుతున్నారు. తాము కూడా బుకింగ్స్ లో మంచి గ్రోత్‌ చూస్తున్నామని ప్రతినిధులంటున్నారు. ఎయిర్‌లైన్స్‌ సంస్థలైతే వాలంటైన్స్‌ డే కోసమంటూ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశ పెట్టినట్లు చెబుతున్నాడు. జెట్‌ ఎయిర్‌ వేస్‌, గో ఎయిర్‌, విస్తారా లాంటి సంస్థలు రెండేళ్ల క్రితం వాలంటైన్స్‌ డేకు ఆఫర్లు పెట్టినట్లుగానే ఇప్పుడూ ప్రత్యేకంగా ప్యాకేజీల రూపొందించాయి. తాజ్‌ గ్రూప్‌ లాంటి స్టార్‌ హోటల్స్‌ ప్రేమికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఫిబ్రవరి 13, 14 తేదీల్లో సెలవులు ఉండడంతో ప్రత్యేక ప్రయాణాలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

సడన్ సర్ ప్రైజ్​..

తమ మనసైన వారి ముచ్చట తీర్చడానికికంటూ కొందరు, తమ నెచ్చెలిని ఆశ్చర్యపరచడానికి మరి కొందరు, తమదైన ప్రేమను చూపడానికంటూ ఇంకొందరు ప్రేమికుల దినోత్సవాన్ని వినూత్నంగా చేయడానికి ప్రణా ళిక చేసుకున్నారు. దీనికి తోడు రెండు రోజులు సెలవులు ఉండడం, మరో ఒకటి రెండు రోజులు సెలవు పెట్టి స్వల్పకాలిక టూ ర్ల కు చాలా మంది వెళ్లిపోయారు. గోవా, ఊటీ, మున్నార్‌, సిమ్లా లాంటి ప్రాంతాలతో పాటు దగ్గరలోని బ్యాం కాక్‌, మాల్దీవులు, సింగపూర్‌, మకౌ లాంటి ప్రాంతాలకు పయనమయ్యారు. ప్రేమకు వయసు అడ్డంకి కాదు.. పెళ్లి చేసుకుంటే ప్రేమ తరిగిపోదు అనే అభ్యుదయభావాలు కలిగిన వారు ఇలా పయణిస్తుంటే.. ప్రేమను చూపడానికి అంతదూరం వెళ్లాలా..? ప్రేమనగరిగా కీర్తి గడించిన భాగ్యనగరంలోనే అంత కన్నా రొమాంటిక్‌గా ప్రేమను వ్యక్తీకరించవచ్చని కొందరు చెబుతున్నారు.

నగరంలోని పలు ప్రాంతాలు..

సీక్రెట్‌ లేక్‌..
ఒకప్పుడు సీక్రెట్‌ లేక్‌గా పిలువ బడే దుర్గం చెరువు ప్రేమ పక్షులను అలరిస్తూనే ఉంది. సహజసిద్ధమైన చెరువు లవర్స్‌కు మాత్రం ఎప్పటికీ అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటి. దుర్గం చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఊగే వంతన ప్రేమికులను మరింత అలరించనుంది.

శామీర్ పేట చెరువు..
నగరానికి అతి సమీపంగా ఉండడం, ఏకాంతంగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ వలస పక్షుల కిలకిల రాగాలు వినాలనుకుంటే ఇది బెస్ట్‌ ప్లేస్‌. ఉదయాన్నే శామీర్​పేట చెరువుకు వెళ్లి సాయంత్రానికి తిరిగి రావచ్చు. ఇక్కడే జింకల పార్కు జంతు ప్రేమికులను అలరిస్తోంది.

హుస్సేన్‌ సాగర్‌-నెక్లెస్‌ రోడ్‌..
తథాగతుడి చెంత ఉన్న హుస్సేన్‌సాగర్‌, దగ్గరలోని లుంబినీ పార్క్‌, ఎన్‌టీఆర్‌ గార్డెన్స్‌, ఈట్‌స్ట్రీట్‌ లాంటి ప్రాంతాలు కొత్తగా ప్రేమలో పడిన వారికి మరపురాని అనుభూతులనే మిగులుస్తాయి. ఎంతో మంది ప్రేమికుల కేరాఫ్ అడ్రస్ గా ఈ ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి.

తారామతి-బారాదరి..
చరిత్రలోకి తొంగిచూస్తూ మధురస్మృతుల్లో జారిపోవాలనుకుంటే తారామతి-బారాదరి కూడా అత్యుత్తమ గేట్‌వేలలో ఒకటిగా చెప్పవచ్చు. ప్రేమికుల రోజు ఆదివారం కావడంతో గజల్స్‌, ఖవ్వాలీలను కూడా ఆస్వాదించవచ్చు.

కేబీఆర్‌ పార్క్‌
నగర నడిమధ్యలో ప్రకృతి సోయగం కేబీఆర్‌ పార్క్‌. చేతిలో చేయి వేసుకుని ఈ పార్క్ లో నడుచుకుంటూ ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు. ప్రేమలో మునిగే వారు, ఇప్పటికే మునిగిన వారు ఈ పార్క్ లో ఎంత దూరం నడిచినా అలసట అనిపించదు.

అనంతగిరి హిల్స్‌
నగరానికి కాస్త దూరంగా, వికారాబాద్‌ దగ్గర ఉన్న అనంతగిరి హిల్స్‌ రొమాంటిక్‌ డెస్టినేషన్‌గా ప్రేమికులకు నిలుస్తుంది.

కొండ పోచమ్మ రిజర్వాయర్..
కొండ పోచమ్మ రిజార్వయర్ చూడ ముచ్చటగా ఉంటుంది. రిజర్వాయర్ చుట్టూ తిరుగుతూ ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చు. అక్కడ ఏర్పాటు చేసిన ప్యారషూట్ లో జంటగా ప్రయణిస్తూ రిజర్వాయర్ అందాలను వీక్షించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed