- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీనా, సైఫ్‌ల 'లవ్ స్టోరి'
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దివా కరీనా కపూర్ …. సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. నిజానికి వీరిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ‘తషాన్’ సినిమా టైంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అనుకుంటారు. కానీ… జరిగింది అది కాదట. సైఫ్ మూడోసారి ప్రపోజ్ చేశాకే తాను పెళ్లికి అంగీకరించానని తెలిపింది కరీనా. ఈ విషయాన్ని ఓ వైబ్ సెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘లఢక్’, ‘జైసల్మేర్’ సినిమాల్లో ఇద్దరం కలిసి నటించామని… అప్పుడే మా ఇద్దరి మధ్య చనువు ఏర్పడిందని తెలిపిన కరీనా… ఆ సమయంలోనే తనతో ప్రేమలో పడ్డానని సైఫ్ అర్ధం చేసుకున్నాడని తెలిపింది. అప్పుడే సైఫ్ ప్రపోజ్ చేసినా… నేను ఒప్పుకోలేదని చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పారిస్ వెళ్లినప్పుడూ రెండో సారి తన ప్రేమను వ్యక్తపరిచాడని చెప్పింది. సైఫ్ తండ్రి కూడా తన తల్లికి పారిస్‌లోనే ప్రపోజ్ చేశాడట.
ఇక ‘తషాన్’ మూవీ సెట్‌లో సైఫ్ థర్డ్ టైమ్ ప్రపోజ్ చేయగానే వెంటనే ఒకే చెప్పేసిందట కరీనా. ఆ తర్వాత సైఫ్ వెళ్లి కరీనాను పెళ్లి చేసుకుంటానని తల్లిని సంప్రదించాడట. మేమిద్దరం ప్రేమలో ఉన్నాం.. తనతోనే లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను చెప్పాడట. సైఫ్ మాటలకు కరీనా తల్లి ఇంప్రెస్ అవడం… వీరిద్దరి పెళ్లికి ఓకే చెప్పడం వెంటవెంటనే జరిగిపోయాట. ఆ తర్వాత వీరిద్దరి ముద్దుల కొడుకు తైమూర్ అలీ ఖాన్ రాకతో బంధం మరింత బలమైంది.
Tags: Kareena Kapoor, Saif Ali Khan, Love Story