మూడు నెలలు ప్రేమ.. ఆపై ఆత్మహత్య

by Shyam |
మూడు నెలలు ప్రేమ.. ఆపై ఆత్మహత్య
X

దిశ, మహబూబాబాద్: రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన స్నేహ సంబంధం ఆ కుటుంబాల పిల్లలలో ప్రేమను పెంచాయి. సరిగ్గా మూడు నెలలు ఒక్కరిని ఒక్కరూ గాఢంగా ప్రేమించుకున్నారు. అబ్బాయి ఇంట్లో వీరి ప్రేమను ఒప్పుకున్నారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన ఆ ప్రేమ జంట ఈ నెల 27న క్రిమిసంహారక మందు సేవించారు. ఇద్దరు ఒక్కరి తర్వాత ఒక్కరు మృత్యుఒడిలోకి వెళ్లిపోయారు. ఈ హృదయ విదారక సంఘటన మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.

వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంకు చెందిన ఓ కుటుంబం గత కొంత కాలంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం గ్రామంలో నివాసం ఉంటుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక మైనర్ బాలిక ఇదే జిల్లాలోని గూడూరు మండలం తీగలవేనీ గ్రామ శివారు భిల్యా నాయక్ తండాకు చెందిన గుగులోత్ సాయి (25) అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇరు కుంటుంబాలకు లారీలు ఉండడంతో.. వ్యాపార రీత్యా ఇరు కుటుంబాల పెద్దలు సన్నిహితంగానే ఉంటారు.

కానీ సరిగ్గా మూడు నెలల క్రితం ఆ మైనర్ బాలికకు సాయితో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమను అబ్బాయి తరపు తలిదండ్రులు ఒప్పుకోగా.. అమ్మాయి తరపు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఈ నెల 27న వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ వట్టివాగు సమీపంలో క్రిమిసంహారక మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఈ నెల 29 న మైనర్ బాలిక మృతి చెందింది.

ఇక గుగులోత్ సాయి మంగళవారం మృతిచెందాడు. వేరువేరు సామాజిక వర్గాల చెందిన ఇరు కుటుంబాల మధ్య ఉన్న స్నేహ సంబందం కాస్త పిల్లలను ప్రేమలోకి దింపి ఆయా కుటుంబాలల్లో విషాదఛాయలను మిగిల్చింది.

Advertisement

Next Story