బాలమ్మ వాగులో చిక్కిన లారీ.. బయటకివచ్చేది ఎలా ?

by Aamani |   ( Updated:2021-09-28 01:30:09.0  )
బాలమ్మ వాగులో చిక్కిన లారీ.. బయటకివచ్చేది ఎలా ?
X

దిశ, నిజామాబాద్ రూరల్: గత రాత్రి నుంచి గులాబ్ తుఫాన్ నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు మోపాల్ మండలంలోని ముత్త కుంట గ్రామంలో బాలమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆరుగురు ప్రయాణికులతో కూడిన లారీ వాగులో చిక్కుకుంది. వాగు ప్రవాహం ఎక్కువ కావడంతో లారీ‌లో ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా లారీ‌లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసేందుకు తహశీల్దార్ వీర్ సింగ్, ఎంపీడీవో సుధాకర్ రావు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లు సహాయంతో వారిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed