- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిద్రలోనే డ్రైవర్ మరణం.. కారణం అదేనా?
దిశ, తుంగతుర్తి: డ్యూటీ అనంతరం ఇసుక లారీ పక్కకు ఆపి నిద్రించిన డ్రైవర్ తెల్లవారే సరికి మృతి చెందాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాటిమెట్ల గ్రామం వద్ద శనివారం చోటుచేసుకుంది. మోత్కూరు ఎస్‌ఐ సీఎచ్ హరిప్రసాద్ కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం వాగు నుంచి మేడ్చల్ జిల్లా జగదేవపూర్‌కు ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ నెంబర్ ఏపీ 39X999 శుక్రవారం రాత్రి సుమారు 11.30 ప్రాంతంలో మోత్కూరు మండలం మెట్ల గ్రామం స్టేజి వద్ద ఆగింది. ఆ తర్వాత లారీ డ్రైవర్ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అయితే, తెల్లవారు తోటి డ్రైవర్లు లేపినా ఎంతకూ లేకపోవడంతో చనిపోయినట్లు నిర్దారించారు.వెంటనే స్థానిక పీఎస్‌కు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లిన చూసిన పోలీసులు డ్రైవర్ మరణానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన కుబీరాన్( 40)గా గుర్తించారు. రాత్రి మద్యం సేవించి డ్రైవర్ స్పృహ కోల్పోయి చనిపోయాడా? లేదా గుండెపోటుతో ప్రాణాలు వదిలాడా అనేది పోస్టు మార్టం అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని ఎస్ఐ తెలిపారు.