వైసీపీకీ ఓటమి తప్పదా..? ఏ పార్టీ ఏన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉందంటే..?

by Indraja |   ( Updated:2024-06-04 04:18:50.0  )
వైసీపీకీ ఓటమి తప్పదా..?  ఏ పార్టీ ఏన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉందంటే..?
X

దిశ వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. కాగా ఆంధ్రుల తోపాటు యావత్ భారతదేశం ఆంధ్రా 2024 ఎన్నికల ఫలితాల్లో గెలిచేది ఎవరు..? ఓటమితో ఇంటి బాట పట్టేది ఎవరు..? అని ఆశక్తికరంగా చూస్తోంది. ఫలితాలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లోనూ.. అలానే ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులోనూ వైసీపీ వెనకబడే ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులపై ప్రత్యర్థులే ఆథిక్యంతో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి టీపీపీ కంచుకోట కుప్పంలో చంద్రబాబు 1549 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

అలానే టీడీపీకి పద్మవ్యూహం లాంటి మంగళగిరిలో ఆ పద్మవ్యూహాన్ని చేదిస్తూ నారా లోకేష్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. అలానే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి వంగా గీతాపై 1000 ఓట్ల మెజారిటీతో ముందజలో కొనసాగుతున్నారు. అలానే పాణ్యంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరిత ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో కోనసాగుతున్న కౌంటింగ్‌ విషయానికి వస్తే.. ప్రస్తుతం వైసీపీ 15, టీడీపీ 56, బీజేపీ 3, జనసేన 8 స్తానాల్లో ఆధిక్యంలో ఉంది.

అధికార పార్టీ అధికారం చేజారనుందా..? లేక మిగిలిన రౌండ్లలో ముందువరసలో నిలవనుందా..? అనే విషయం తెలియాలంటే కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవకు వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed