- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో బీజేపీ ఐదు సీట్లు కోల్పోయింది.. కాంగ్రెస్ ఎనిమిదికి ఎగబాకింది: సామ
దిశ, తెలంగాణ బ్యూరో: లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఐదు సీట్లు తగ్గాయని మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ... మోడీ, కేసీఆర్ కలిసే ఎన్నికల్లో పోటీ చేశారనీ, 2019లో ఆ రెండు పార్టీలు కలిపి 13 సీట్లు రాగా, ఎన్నికల్లో ఎనిమిది సీట్లకు గ్రాఫ్ పడిపోయిందని వివరించారు. కానీ కాంగ్రెస్ పార్టీ 2019లో గెలిచిన మూడు సీట్ల నుంచి, అమాంతంగా ఎనిమిదికి పెరిగామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు తెర వెనుక ఒకటేనని స్పష్టం చేశారు. దీన్ని తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా గుర్తించి, ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పారని వెల్లడించారు. గతంతో పోలిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ భారీగా పెరిగిందన్నారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్‌లు కలిసే పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ సునాయాసంగా 8 సీట్లలో విజయం సాధించిందన్నారు. 2019లో గెలిచిన మూడు సీట్ల నుంచి, ప్రస్తుతం ఎనిమిదికి పెరిగామన్నారు. రాబోయే రోజుల్లో లోక్సభ సెగ్మెంట్లన్నీ కాంగ్రెస్ క్వీన్ స్లీప్ చేసేలా పని చేస్తామన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు ఇండియా కూటమి చుక్కలు చూపించిందని అన్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసినా, రామ మందిరం ప్రభావం కనిపించలేదన్నారు. ఇండియా కూటమి దెబ్బకు బీజెపీ సింగల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తిని కోల్పోయిందన్నారు. మోడీ గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోయి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హవా పెరిగిందన్నారు. బీజేపీకి రాముడు బుద్ధి చెప్పాడని విమర్శించారు. మోడీకి గతంలో పోల్చుకుంటే 66% మెజార్టీ తగ్గింది అంటేనే అర్థం చేసుకోవచ్చన్నారు. గతంలో నాలుగు లక్షల 75 వేల మెజార్టీ ఉంటే, ఇప్పుడు మోడీ మెజారిటీ ₹1,50,000 కు పడిపోయిందన్నారు. రాహుల్ గాంధీ నిర్వహించిన జోడో యాత్రల ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైనదన్నారు. ఇక పదేళ్లు రాష్ట్రంలో పవర్‌లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కవడం వలనే, తన నాశనాన్ని తానే కోరి తెచ్చుకుందన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ భూస్థాపితం అయిపోయిందన్నారు. గడిచిన పదేళ్లుగా మోడీ చేసిన తప్పిదాలను కేసీఆర్ ప్రశ్నించలేదన్నారు.