- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిజర్వేషన్ రద్దుపై మందకృష్ణ వైఖరేంటి? మౌనమెందుకు?
దిశ, తెలంగాణ బ్యూరో: రిజర్వేషన్ రద్దుపై మందకృష్ణ వైఖరేమిటో? స్పష్టంగా వెల్లడించాలని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నా, మందకృష్ణ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. గురువారం గాంధీభవన్‌లో గజ్జెల కాంతం మీడియాతో మాట్లాడుతూ... రిజర్వేషన్ లేకుండా చేసి ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశాన్ని పాలించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తుందన్నారు. అందుకే 400 సీట్లు రావాలని బీజేపీ టార్గెట్ పెట్టుకున్నదన్నారు. బీజేపీ చేస్తున్న కుట్రలకు నిరసనగా మే 4న భారత రాజ్యాంగ రక్షణ దీక్ష చేయబోతున్నామన్నారు.
దేశంలో ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు ఎక్కువగా ఉన్నారని, అందుకే బీజేపీ రిజర్వేషన్లను తొలగించాలని చూస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న అన్ని రాష్ట్రాలలో ఇప్పటికే మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుతున్నాయని, రిజర్వేషన్లు తొలగించి వాళ్లను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 14 పార్లమెంట్ సీట్లలో గెలవబోతున్నదన్నారు. లోకసభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు.
Read More..
పాతబస్తీలో మతకలహాలు సృష్టించేందుకు అమిత్ షా కుట్ర: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి