- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘400 సీట్లా.. బీజేపీకి అంత సీన్ లేదు’
దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా బీజేపీ 200 సీట్లు కూడా గెలవదని కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ కన్వీనర్ దిలీప్ కుమార్ అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. మోడీ గ్రాఫ్ పడిపోయిందని, థర్డ్ టైమ్ వచ్చే ఛాన్స్ లేదన్నారు. అబ్ కీ బార్ 400 అంటూ ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ రెడీ అయిందన్నారు. బీజేపీకి అంత సీన్ లేదన్నారు. ప్రజలు కర్రు కాచి వాత పెట్టేందుకు రెడీగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల రాష్ట్రాల పై కేంద్రం పెత్తనం చేస్తుందన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుందన్నారు. మ్యాచింగ్ గ్రాండ్స్ నిలిపివేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తుందన్నారు. పంచాయతీ రాజ్ చట్టంలోని గైడ్ లైన్స్‌ను పాటించట్లేదన్నారు.
గ్రామ పంచాయతీల నిధులపై కూడా కేంద్రం అజమాయిషీ చేస్తుందన్నారు. ఇంత కంటే దారుణం మరోకటి లేదన్నారు. బీజేపీ మళ్లీ కేంద్రంలో రిజర్వేషన్లు తొలగిస్తుందన్నారు. 400 సీట్లు గెలిస్తే రాష్ట్రాలు హక్కులను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉన్నదన్నారు. అందుకే కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాంగ్రెస్ దేశంలో పవర్‌లోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడన్నారు. మాజీ మంత్రి పుష్పలీల మాట్లాడుతూ..మోడీ గ్రాఫ్ 100 శాతం పడిపోయిందన్నారు. ఓడి పోతామని ఫ్రస్టేషన్ లో మోడీ ఉన్నాడన్నారు. రైతుల గురించి ఏనాడు మాట్లాడలేదన్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చి, రైతుల మరణాలను కారణమయ్యాడన్నారు. ఈ కార్యక్రమంలో స్పోక్స్ పర్సన్ కమల్, లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
కలలోనూ ఊహించని స్కీం తెస్తాం.. నర్సాపూర్ సభలో రాహుల్ గాంధీ సంచలన ప్రకటన