- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ MP అభ్యర్థిపై భూకబ్జా కేసు నమోదు
దిశ, ఇబ్రహీంపట్నం: భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఈ నెల 13న కోర్టు ఆదేశాలతో రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో భూకబ్జా కేసు నమోదు అయ్యింది. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని రంగన్నగూడ సర్వే నెంబర్ 500, 501లలో 200 గజాల ప్లాట్ కబ్జా చేశారంటూ కంచర్ల రాధిక అనే మహిళ ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్‌పై సెక్షన్ 447, 427, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ప్లాటును కిరణ్ కుమార్ రెడ్డి 2003లో, రాధిక 2015లో కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు ఉన్నాయని ఆదిభట్ట సీఐ రాఘవేంద్ర వివరణ ఇచ్చారు. ఈ కేసుపై ఇద్దరి డాక్యుమెంట్స్ తీసుకొని పూర్తి విచారణ జరుపుతున్నామని, ఇందులో డబుల్ రిజిస్ట్రేషన్ జరిగాయా? లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసుపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదిభట్ల సీఐ తెలిపారు.