- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా.. వీళ్లకు రూల్స్ వర్తించవా !
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు లాక్‌డౌన్ ప్రకటించి అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తులు బేఖాతరు అవుతున్నాయి. గ్రామాల నుంచి నగరాల వరకు ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తుంటే, కొందరు రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు కనీసం సోషల్ డిస్టెన్స్‌ను మెయింటైన్ చేయకుండా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. సాక్షాత్తు బీజేపీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లో సీఎం ఆదిత్యనాథ్ ఉగాది వేడుకల్లో పాల్గొని ఎలాంటి సామాజిక దూరం పాటించకపోవడమే ఇందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ అయితే, తెలంగాణలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరో ఎక్సాంపుల్. అటు దేశ ప్రధాని, రాష్ట ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌లు పెట్టి నలుగురి కంటే ఎక్కువ గుమికూడొద్దని చెప్పిన 24గంటల్లోపే యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రంలో ఇంద్రకరణ్‌రెడ్డి ఉగాది వేడుకల్లో పాల్గొని కనీసం మాస్క్‌లు కట్టుకోక పోవడం గమనార్హం.
పైనున్న మొదటి ఫోటో ప్రధాని మోడీ కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నది. రెండోది తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం ఫోటో. ఈ రెండు ఫోటోల్లో కూడా సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తూ కనీసం మీటరు దూరం వరకు అక్కడ కేంద్ర మంత్రులు, ఇక్కడ రాష్ట్ర మంత్రులతో పాటు అధికారులు, విలేకరులు దూరాన్ని మెయింటైన్ చేశారు. కానీ ప్రధాని మోడీ చెసిన ఆదేశంతో పాటు, కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో సైతం నలుగురి కంటే ఎక్కువ గుమికూడొద్దు. అంతకన్న ఎక్కువుంటే 144 సెక్షన్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కానీ యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవన్నీ లెక్కలోకి తీసుకోనట్లుగా నలుగురి కంటే ఎక్కువ మందితోనే జమయి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఇక్కడ తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం పంచాంగ శ్రవణంలో పాల్గొని, ఎలాంటి మాస్క్ ధరించక పోవడమే గాక మీటర్ దూరం డిస్టెన్స్‌ను సైతం బేఖాతరు చేశారు.
ఓ వైపు ప్రపంచం మొత్తం హోం క్వారంటైన్ తీసుకుంటూ ఇంట్లో ఉన్నవారే సోషల్ డిస్టెన్స్ పాటిస్తుంటే, యూపీలో సీఎం, తెలంగాణలో మంత్రి ఎలాంటి నియమ, నిబంధనలను పాటించకుండా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఈ ఫోటోలు చూసిన తర్వాత చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే చట్టాలు చేసేవారే చట్టాలు ఉల్లంఘించవచ్చు, వారు అన్నింటికీ అర్హులే అన్న ప్రశ్న సామాన్య ప్రజల నుంచి ఉత్పన్నమయ్యేలా చేస్తుంది.
పైన కనిపిస్తున్న ఫోటో పచ్చని ప్రకృతిలో చెట్ల మధ్య నివసించే ఆదివాసిలది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో నివసించే ప్రజలు. వీరంతా కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో మాస్క్‌లు దొరక్కున్నా వారికి ఉన్న ఆలోచనతో మూతికి మోదుగు ఆకులు కట్టుకొని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కానీ మన దగ్గర రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న కొందరు నేతలు ప్రెస్‌మీట్లలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ కనీసం మాస్క్‌లు కూడా కట్టుకోకుండా ఉగాది వేడుకల్లో పాల్గొంటున్నారు.
tags: Coronavirus, LockDown India, Cm Kcr, Modi, janata Curfew