- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ రెండు ఒకటి కాదు.. వేర్వేరు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కొవిడ్ 19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్, ఎమర్జెన్సీ ప్రకటనకు పోలిక లేదని, రెండు వేర్వేరు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్దేశిత సమయంలోపు చార్జిషీటు దాఖలు కాకున్నా నిందితుడికి బెయిల్ తిరస్కరిస్తూ తీసుకున్న మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టింది. సీఆర్‌పీసీలోని 167(2) సెక్షన్ సూచించిన సమయంలోపు చార్జిషీటు దాఖలు కాకుంటే సదరు నిందితుడు బెయిల్ పొందే హక్కు కలిగి ఉంటాడని గుర్తుచేసింది. లాక్‌డౌన్ విధించిన ఆంక్షలు నిందితుడికి బెయిల్ మంజూరు చేయమని అడిగే హక్కును ఇవ్వదని భావించడం తప్పు అని పేర్కొంది. సెక్షన్ 167(2) ఇచ్చే హక్కులను లాక్‌డౌన్ ఆంక్షలు హరిస్తాయని భావించడం సరికాదని తెలిపింది. కాబట్టి హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఈ నిర్ణయం తీసుకోవడంలో పొరబడ్డారని అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, సదరు నిందితుడికి ఇద్దరు ష్యూరిటీలు, రూ. 10వేల బాండ్‌లపై బెయిల్ మంజూరు చేసింది.