విజయనగరంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్

by srinivas |
విజయనగరంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్
X

దిశ ఏపీ బ్యూరో: నేటి నుంచి విజయనగరం జిల్లాలో స్వచ్ఛంద లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విజయనగరంలో మాట్లాడుతూ, విజయనగరం జిల్లాకి నాలుగు సంజీవని బస్సులు కేటాయించారని తెలిపారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తిగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వైద్య ఆరోగ్య శాఖ హెల్ప్ లైన్ నెంబర్‌కి ఫోన్ చేయాలని సూచించారు. నేటి నుంచి వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వైద్య ఖర్చును ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందిస్తున్నామని ఆయన చెప్పారు. వైఎస్సార్ ఆసరా ద్వారా చికిత్స పొందిన వారికి ప్రత్యేక భృతి కల్పిస్తున్నామని అన్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 52,535 శాంపిల్స్‌ పరీక్షించగా 50, 156 మందికి నెగిటివ్‌ వచ్చిందని, జిల్లాలో ఇప్పటి వరకు 1073 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ఇందులో 425 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed