మారుతీ సుజుకి తొలిసారి జీరో అమ్మకాలు!

by Harish |
మారుతీ సుజుకి తొలిసారి జీరో అమ్మకాలు!
X

కొవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి 40 రోజులు కావస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ వల్ల దేశంలో కలిగిన నష్టాల ఫలితాలు వులుగులోకి వస్తున్నాయి. 40 రోజులుగా కార్యకలాపాలన్నీ స్థంభించిపోయాయి. చిన్న సంస్థల నుంచి బడ్డా కంపెనీల వరకూ, సామాన్య పౌరుడి నుంచి సంపన్నుల వరకూ కరోనా కల్లోలానికి నష్టాలను ఎదుర్కొన్నవారే. ముఖ్యంగా కీలక రంగాల్లో ఒకటైన తయారీ రంగంలో ఇండియాలోనే అతిపెద్ద కార్య తయారీ సంస్థ మారుతీ సుజుకి అత్యంత దారుణంగా నష్టపోయిది. దేశీయ మార్కెట్లో ఏప్రిల్ నెలకు ఎటువంటి విక్రయాలు నమోదవలేదనీ, కరోనాను అరికట్టేందుకు లాక్‌డౌన్ ఆంక్షల వల్ల సంస్థకు చెందిన అన్ని షోరూమ్‌లు, ఆఫీసులు మూసేయబడ్డాయని మూరుతీ సుజుకి తెలిపింది. ప్లాంట్లన్నీ మూతపడి ఉత్పత్తి పూర్తిగా కషీణించడంతో ఉద్యోగులందరూ ఇళ్లకె పరిమితమయ్యారు. ఈ లాక్‌డౌన్ కాలంలో ఒక్క కారు కూడా విక్రయానికి నోచుకేలదని సంస్థ పేర్కొంది.

మారుతీ సుజుకి శుక్రవారం అందించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో 2020, ఏప్రిల్‌కు దేశీయ మార్కెట్లో ఎమ్ఎస్ఐఎల్ అమ్మకాలు జీరో అని పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వాదేశాలకు అనుగుణంగా ఉత్పత్తి సౌకర్యాలను ఆపేయడంతో అమ్మకాలు జరగలేదని తెలిపింది. ఇతర ఒరిజినల్ పరికరాల తయారీ సంస్థ అమ్మకాలు కూడా అస్సలు లేవని, సంస్థ 632 యూనిట్లను ఎగుమతి చేసినట్టు మారుతీ సుజుకి తెలిపింది. ఇక, వినియోగదారుల సౌర్యం నిమిత్తం లాక్‌డౌన్ కారణంగా సంస్థ జూన్ 30 తేదీ వరకూ కార్లకు చెందిన ఉచిత సర్వీసులను, ఎక్స్‌టెండెడ్ వారంటీ తేదీల గడువును పొడిగిస్తున్నట్టు ఇదివరకే స్పష్టం చేసింది.

Tags: Maruti Suzuki, nil domestic sales, coronavirus impact, Maruti Suzuki India Ltd

Advertisement

Next Story

Most Viewed