- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అద్దె చెల్లించాలంటూ ఎంపీడీఓ ఆఫీసుకు తాళం
దిశ ప్రతినిధి, కరీంనగర్: తన భవనానికి రావాల్సిన అద్దె ఇచ్చేవరకూ ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేశాడు ఇంటి యజమాని. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నూతన మండలాల ఆవిర్భావంలో భాగంగా గన్నేరువరం మండలాన్ని అధికారులు నూతనంగా ఏర్పాటు చేశారు. కార్యాలయం ఏర్పాటు కోసం అధికారులు ప్రైవేట్ భవనాల్లో ఆఫీసులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గన్నేరువరం ఎంపీడీవో కార్యాలయం కోసం 2019 జులైలో అద్దెకు తీసుకున్నారు. నెలకు రూ. 12,500 చొప్పున కిరాయి ఇచ్చేందుకు అధికారులు ఒప్పందం చేసుకున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు ఇరవై తొమ్మిది నెలలు గడవగా 11 నెలల కిరాయి మాత్రమే ఇచ్చారని మిగతా కిరాయి ఇవ్వడం లేదని ఇంటియజమాని తిరుపతి వివరించారు. అద్దె చెల్లించాలని అడుగుతుంటే అధికారులు రేపు, మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు అద్దె రూపంలో రూ. 2.25 లక్షలు రావాల్సి ఉందని వివరించారు. తాను బ్యాంకు లోను తీసుకుని భవనాన్ని కట్టించానని, నెలవారీగా చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని తిరుపతి తెలిపారు. తనకు రావాల్సిన అద్దె బకాయి మొత్తం చెల్లించే వరకూ ఎంపీడీవో కార్యాలయ తాళం తీసేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. అద్దె మొత్తం చెల్లించి ఆఫీసు ఖాళీ చేయాలని తిరుపతి డిమాండ్ చేస్తున్నారు.
- Tags
- key