- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొనసాగుతున్న పోలింగ్.. గడువు ముగియగానే గేట్లకు తాళం
by Shyam |
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రైవేటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 65 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమయము నాలుగు గంటలు దాటగానే అధికారులు ఆయా పోలింగ్ స్టేషన్లకు తాళాలు వేశారు. నిర్ణీత గడువులోగా పోలింగ్ కేంద్రాలలో ఉన్న వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండడంతో ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపుగా జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు బారులు తీరి ఉన్నారు. పోలింగ్ ముగియడానికి మరో 2, 3 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
Advertisement
Next Story