‘ఓట్లకు వస్తారు కదా అప్పుడు మాట్లాడుతా’

by Anukaran |   ( Updated:2020-10-15 04:38:24.0  )
‘ఓట్లకు వస్తారు కదా అప్పుడు మాట్లాడుతా’
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిని మహిళలు నిలదీశారు. వరదల్లో బోటు సాయంతో కాలనీల్లో పర్యటిస్తున్న ఆయన పై వాగ్వాదానికి దిగారు. భారీ వర్షాల కారణంగా ఉప్పల్‌ నియోజకవర్గంలోని పలు కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి. కాలనీ రోడ్లు నదులను తలపించడంతో.. స్థానిక ఎమ్మెల్యే బోటు సాయంతో ఆయా కాలనీల్లో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో పలువురు మహిళలు ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే వాళ్లు.. ప్రజలు కష్టాల్లో ఉంటే తప్పించుకొని పోతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓట్లకు వచ్చినప్పుడు మాట్లాడుతాం అంటూ ఓ మహిళ సవాల్ విసిరారు. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

Advertisement

Next Story