- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
స్థానిక కేటాయింపులు జాగ్రత్తగా నిర్వహించాలి.. ప్రత్యేక అధికారి రోనాల్డ్ రోస్..
దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉద్యోగులకు స్థానిక కేటాయింపులను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేక అధికారి రోనాల్డ్ రోస్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, సీతారామ రావులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎన్ని శాఖల ఉద్యోగులకు స్థానిక కేటాయింపులు జరిగాయి, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి అన్న వివరాలను రోనాల్డ్ రోస్ అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్దేశించిన సమయంలో స్థానికత కేటాయింపులు పూర్తిచేయాలని రోనాల్డ్ రోస్ కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ శాఖల ఉద్యోగుల స్థానికత కేటాయింపులు పూర్తయ్యాయని, ఉపాధ్యాయుల జాబితాల తయారీ ముగింపు దశకు వచ్చిందని కలెక్టర్ వెంకట్రావు ప్రత్యేక అధికారి రోనాల్డ్ రోస్ కు వివరించారు.