కౌలు రైతులకు రూ.8,500 కోట్ల రుణాలు

by srinivas |
కౌలు రైతులకు రూ.8,500 కోట్ల రుణాలు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ ఏపీ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. తాజాగా రాష్ట్రంలోని ప్రతి కౌలు రైతుకు బ్యాంకు రుణం ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ ఏడాది కౌలు రైతులకు రూ. 8,500 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని… ప్రతి కౌలు రైతుకు రుణం ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించామని చెప్పారు. కౌలు రైతులకు సాగు హక్కు పత్రం ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాడి రైతులు, కౌలు రైతులు, జాలర్లకు కిసాన్ క్రెడిట్ కార్డులను ఇస్తామని చెప్పారు. బుధవారం ఏపీ సచివాలయంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో అన్ని చోట్ల సకాలంలో వర్షాలు పడుతున్నాయని… ఈ ఖరీఫ్ సీజన్ చాలా ఆశాజనకంగా ఉందని కన్నబాబు చెప్పారు. సాధారణ స్థాయి కన్నా 51 శాతానికి పైగా వర్షం వచ్చిందని, రిజర్వాయర్లలో కూడా నీటి లభ్యత బాగుందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ముందుచూపు వల్ల ఈసారి విత్తన సమస్య లేదని అన్నారు. చరిత్రలోనే మొదటిసారి పొగాకు కొనుగోళ్లను ప్రారంభించామని, దీని కోసం రూ.200 కోట్లను కేటాయించాలని సీఎం ఆదేశించారని చెప్పారు.

Advertisement

Next Story