30 ఏండ్ల తర్వాత టైటిల్ గెలిచిన లివర్‌పూల్

by Shiva |
30 ఏండ్ల తర్వాత టైటిల్ గెలిచిన లివర్‌పూల్
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 30ఏండ్ల తర్వాత లివర్‌పూల్ జట్టు టైటిల్ గెల్చుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. గురువారం రాత్రి మాంచెస్టర్ సిటీతో జరిగిన మ్యాచ్‌లో చెల్సియా జట్టు 2-1 తేడాతో విజయం సాధించడంతో అత్యధిక పాయింట్లతో లివర్‌పూల్ జట్టు మొదటిసారి ఈపీఎల్ టైటిల్ ఎగరేసుకొని పోయింది. చెల్సియా జట్టు ఈ మ్యాచ్ ఓడిపోయుంటే లివర్పూల్ మరో మ్యాచ్ వరకు వేచి చూడాల్సి వచ్చేది. కానీ, చెల్సియా జట్టులోని క్రిస్టియన్‌ పులిసిక్‌, విలియమ్‌ సీల్డ్‌ ఆఖరి నిమిషంలో గోల్స్‌ చేయడంతో చెల్సియా జట్టు 2-1 తేడాతో మాంచెస్టర్‌ సిటీని ఓడించింది. లివర్‌పూర్ విజేతగా కాగానే అభిమానులు స్టేడియం వెలుపల వేలాదిగా చేరి సంబురాలు జరుపుకున్నారు. పటాకులు పేల్చి, వాయిద్యాలు వాయిస్తూ వేడుకలు జరిపారు. మరోవైపు ఈ విజయంతో చెల్సియా జట్టు చాంపియన్స్ లీగ్‌లో స్థానం సంపాదించింది. గార్డ్ ఆఫ్ ఆనర్ కింద లిపుర్ పూల్ తన తదుపరి మ్యాచ్‌లో మాంచెస్టర్ సిటీతో తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed