- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాకు అధికారమిస్తే రూ.60కే లీటర్ పెట్రోల్
కొచ్చి : కేరళకు చెందిన బీజేపీ నేత మండుతున్న ఇంధన ధరలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారాన్నిస్తే ఇంధనాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని, తద్వారా లీటర్ పెట్రోల్ ధరను రూ. 60కే తగ్గిస్తామని బీజేపీ నేత కుమ్మనాం రాజశేఖరన్ వెల్లడించారు. కేరళలో ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఆయన కొచ్చిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీలో కలుపకుండా ఎల్‌డీఎఫ్ ఎందుకు అడ్డుతగులుతున్నదని ప్రశ్నించారు. అది జాతీయ సమస్య అని, ఆ నిర్ణయం వెనుక సరైన కారణాలుండవచ్చునని తెలిపారు.
ఇంధనంపై జీఎస్టీని విధించలేమని రాష్ట్ర మంత్రి థామస్ ఇసాక్ ఓ సందర్భంలో అన్నారు. ఆయన వ్యాఖ్యలను రాజశేఖరన్ ప్రశ్నించారు. అంతర్జాతీయ స్థాయిలో అనేక అంశాలు చమురు ధరలను నియంత్రిస్తుంటాయని, కానీ, వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై ఎల్‌డీఎఫ్‌కు ఉలుకు ఎందుకు అని అడిగారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ఆ లబ్దిని చేరకుండా కేంద్రం అడ్డుకుంటున్నదని, అంతేకాకుండా రాష్ట్రాల వాటాపై కన్నేసిందని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.