- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవిమాట: బలహీనుడిపై బలవంతునిదే పైచేయి
ఈ లోకంలో మానవత్వం మంటగలిసిపోతున్నది..
బలహీనునిపై బలవంతునిదే పైచేయి అవుతున్నది..
మృగాళ్ళ చేతిలో బేలగా అబల బలి అవుతున్నది..
ఆయినా వ్యవస్థ కళ్ళు లేని కబోది అవుతున్నది..
ఈ జాడ్యానికి ఆద్యంతం లేకుండా పోతున్నది..
రక్షణ వ్యవస్థ చేష్టలుడిగి నేల చూపు చూస్తున్నది..
సకాలంలో నేర నిరూపణ చేయలేకపోతున్నది..
వ్యవస్థ అలసత్వం నేరస్తులకు బలాన్నిస్తున్నది..
నేరస్తులను కట్టడి చేయడంలో విఫలమవుతున్నది..
అధికార పక్ష నాయకుల తాబేదార్లవుతున్నది..
రాజకీయ నాయకుల ఆధిక్యమధికమవుతున్నది..
కీచకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకపోతున్నది..
సాక్ష్యాలున్నప్పటికీ న్యాయదేవత గుడ్డిదవుతున్నది..
ప్రలోభాలకు లొంగి సిగ్గుతో తలవాల్చుకుంటున్నది..
ప్రజల ప్రాణమానాలకు రక్షణ లేకుండాపోతున్నది..
దేశంలో మాత్రం ప్రజాస్వామ్యం కొనసాగుతున్నది..
యేచన్ చంద్ర శేఖర్
8885050822
- Tags
- poet word