- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గద్దరన్న యాడ బోలా...!
మీలోనే పుట్టినోణ్ణి
మీతోనే ఎదిగినోణ్ణి
మీతోనే నడుస్తు ఈ
లోకం తీరెరిగినోణ్ణి
ఈడకెళ్ళి యాడకెల్దునో
మిమ్మొదిలీ ఆడకెళ్ళి యాడబోదునో ॥
మీతోనే నేనుంటా
మీ ఇంటే నా పంటా
నిప్పులు చిమ్మే మీమీ
కలాల్లోనె నేనుంటా
జనకోపం మండే మీ
గళంలోనె నేనుంటా ॥ఈడ॥
మతం పిచ్చిపట్టినోళ్ళ
భరతం పట్టిస్తుంటా
గజ్జెల డమరుకమౌతూ
గుండెలదరగొడ్తుంటా
జాతుల చిచ్చునురేపే
మోసాల్ కనిపెడ్తుంటా
ప్రశ్నించే నాలుకనై
మీగొంతుకలో నేనుంటా ॥ఈడ॥
గిరిజనులందరి గుండై
ఎల్లప్పుడు తోడుంటా
పీడిత బహుజనులందరి
దండోరానై ఉంటా
కసితో రగిలే కళ్ళలొ
ఎర్రని మెరుపై ఉంటా ॥ఈడ॥
గుండెలరాగం పలికే
పాటై మీనోటుంటా
మీమాటల తూటానై
నిత్యం పేల్తూ ఉంటా
ఉద్యమాల ఊపిరితో
రగిలే మీలో ఉంటా
ధనస్వామ్యం కాల్చెటేల
చేతిలొ చిచ్చై ఉంటా ॥ఈడ॥
తీగల తుప్పల గుట్టల
నడిరేతిరి నడ్చెటేల
అరె 'ఛల్ భయ్-హుసారంటు'
ఊతకర్రనై ఉంటా ॥ఈడ॥
పోరుబాటలో మీతో
పోరుపాటనై ఉంటా
సోషలిజం వెలుగులకై
కదిలే మీముందుంటా
పదండి పోదాం అంటూ
వెన్నుతడు వస్తుంటా ॥ఈడ॥
పిచ్చిపట్టినోళ్ళ లెక్క
యీడేడల ఎతక్కుండ్రి
నిమ్మలంగ మనసువెట్టి
మీలో నన్నెతుక్కుండ్రి
మిమ్మొదిలీ యాడకెళ్ళలా...!
మీ గుండె గూటిలోనె ఉండినా
- ఏటుకూరి ప్రసాద్
నవచేతన పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు
04027638247
- Tags
- poem on Gaddar