- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూసీ కళ్ళు మూసి
మూసి కళ్ళు మూసి
కడుపు నిండా కంపు చెత్త పడవేసి
మూతి ముక్కు మూసి
మూసి గర్భాన వేస్ట్ అంతా పోసి
పక్కటెముకలపై
పక్కా ఆవాసాలు నిర్మాణం చేసి
అడుగడుగునా వంతెనల
వంచనలతో గొంతు కోసి
నన్ను కుదింపచేసి
ఊపిరి తీస్తున్న జనులారా!
కనుడి వినుడి నా గత
ఘనమైన వైభవ గాథ!
స్వసుఖము నే మరచి
సస్యశ్యామలములు పండించి
మీదు దప్పిక తీర్చితి
సాగరం వరకు స్వచ్ఛంగా పరిగిడితి
నాకిప్పుడు మీ దాహం తీర్చలేని గతి
దాపురింపచేసే గదా మీ నీతి!
నష్ట పరిహారం
కాదు సమస్యకు పరిష్కారం!
గంప కింద కోడి పిల్లలు
తెల్లారేసరికి అనాద తల్లి పిల్లలు!
కట్టుకున్న గూళ్ల కూల్చి వేతలు
రెక్కలు తెగిన పక్షుల వ్యతలు!
ఇకనైనా కళ్ళు తెరవండి
మీ ముక్కుతో గాలి పీల్చండి!
మూసీ ఉండొద్దు కళ్ళు మూసినట్లు
రెండు కండ్లు విప్పారినట్లు ఉండాలి
పాలసంద్రం పారుచున్నట్లు!
హైడ్రా అడ్డుకోత నిలువు కోత
ఏదైనా కడుపు కోత !
లేకుండా ముచుకుందకు
పునర్ వైభవం తీసుకురండి!
(మూసి సుందరీ కరణ)
పి.బక్కారెడ్డి
9705315250
- Tags
- Poem