- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ శాంతి
వెన్నెల వెలుతురుల
వెలుగులు అంధకారమవుతుంటే
వేగుచుక్క శాంతి పతాకం పట్టుకుని
నింగి నుంచి నేలకు రాలిపోతుంటే
పొడిచే పొద్దు ఎర్రటి రక్తపు మడుగుల మధ్య
దీనంగా పడి ఉంటే
మూడు లోకాలు ఏలే త్రిమూర్తుల ముందు
దీపం ముట్టిస్తే సరిపోతుందా?
ఆవేశాలు కట్టలు తెంచుకొని
ఆగక పరిగెడుతుంటే
నాలుగు దిక్కులు పిక్కటిల్లి
గగ్గోలు పెడుతుంటే
మాటలొచ్చిన రామచిలక మంత్రాలు చెప్తుంటే
వంచన వంశాలను చుట్టేస్తూ రాజ్యాలను ఏలుతుంటే
పతితులందరూ పంతానికి పోయి
రుధిర జ్వాలలు గుండెల్లో నింపుతుంటే
ఆటవిక పాలనకు చెదలు పట్టేది ఎప్పుడు
ఆప్తులుగా అందరూ మారేది ఎప్పుడు
ప్రజ్వల్లిళ్లుతున్న దేశాల మధ్య రణమాగేదెప్పుడు
పచ్చని పతాకం పల్లెలా మెరిసేది ఎప్పుడు
ప్రపంచ శాంతి అష్టదిక్కులా వెలిగేది ఎప్పుడు
కదిలే నా కలం విసిరే ప్రశ్నలకు
సమాధానం దొరికేది ఎప్పుడు
చేయి చేయి పట్టి బతుకులు సాగేది ఎప్పుడు
నిరంతర ఈ రణ ప్రవాహానికి
అడ్డుకట్ట వేసేది ఎప్పుడు
కాలం చెప్పే జవాబుకి సమయం పడుతుంది
కలం కదిపిన అక్షరాల వలన ఆలోచన పుడుతుంది
ఒక్కసారి యోచించు జగతి భవత రక్షించు...
-పోలగాని భాను తేజశ్రీ
98665 97260
- Tags
- Poem