అసంతృప్త జీవులు

by Ravi |   ( Updated:2024-09-08 18:45:20.0  )
అసంతృప్త జీవులు
X

అలుపెరగని ఆశయం కోసం

నిత్యం వ్యంగించే మనసుతో

సరితూగని సమయపాలనతో

అసమ్మతించే సమాజంలో

జీవితం కోసం పోరాడుతూ

బయల్దేరిన ఓ బతుకు బాటకై !

ఎన్నో జీవితాలు ఆకలి కోసం

పరువు, నాగరికత కోసం అంటూ

ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలు

దాటినా తప్పని మానసిక క్షోభ. !

ప్రయత్నించే వారికీ సహాయం అందదు

సహాయం చేయాలనే వారికీ సమయం ఉండదు

స్పందించినా, ఆర్థిక స్థితి ఉండదు

అన్ని ఉన్న వారికీ ఈ ఆలోచనలే ఉండవ్!

నమ్మకాలూ, మూఢనమ్మకాలు అంటూ

ఆదార రహితం, అనర్హం,

అసంభవం అనిపించినా పాటించడం వల్లా

తప్పని మరెన్నో కష్టతరమైన ఇబ్బందులు...

ప్రవర్తనలో మార్పుచెందినా,

ఆలోచనలతో ఆందోళనకు దారితీసే

అనేక పరిస్థితులను ఎదుర్కోవాల్సిందే.

సంతృప్తి చెందని జీవాలే మానవులు!

రాచకొండ సాగర్

70958 22883

Advertisement

Next Story